6.12.09

సవ్వడి

ఉదయాన్నే పువ్వుల సవ్వడి.. పగలంతా సూర్యుని సవ్వడి.. రాత్రి నక్షత్రాల సవ్వడి.. ఇవి ఆయా సమయాల్లోనే ఉత్తేజాన్ని అందిస్తాయి. అలా కాకుండా ప్రతీ క్షణం ఉత్తేజాన్ని ఇచ్చేది గుండె సవ్వడి. అందుకే దాని సవ్వడి ఎప్పుడూ అత్భుతమే!

ప్రతీ గుండె తనదైన సవ్వడి చేస్తుంది. ఆ మనసుకి మాత్రమే అర్థమయ్యే సవ్వడి. అందుకే " గుండె గుండెకో సవ్వడి " అంటారు.

ఈ గుండె సవ్వడిలో ఎన్నో ఆశలు.. ఎన్నో ఊసులు.. ఇంకెన్నో ఇష్టాలు.. అంతే స్థాయిలో కష్టాలు.. ఓటములు.. కన్నీరు.. ఇలా చాలా ఉంటాయి. కాబట్టే దాన్ని ఇష్టపడనివారు ఉండరు. రెండవవాటితోనే మొదటివాటికి విలువ. వీటిన్నింటినీ నిక్షిప్తం చేసేదే " గుండె సవ్వడి ".

స్పూర్తి :-

స్వాతి గారి " స్వాతి చినుకులు ", పరిమళ గారి " పరిమళం "... ఈ రెండు బ్లాగులు నాకు చాలా స్పూర్తినిచ్చాయి. బ్లాగు తయారుచేసుకుని అందులో టపా పెట్టినంతవరకూ నన్ను ఊరుకోనివ్వలేదు. వాళ్ల టపాలకన్నా వాళ్లు పెట్టుకున్న పేర్లే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చాయి. ఎంత చక్కగా పెట్టుకున్నారు అనిపించింది.
స్వాతి గారి బ్లాగు చిరునామా "ఊసులు". తన ఊసులకు "స్వాతి చినుకులు" అని ఎంత అందంగా పేరు పెట్టుకున్నారు. స్వాతి గారు పెట్టుకోవడం వల్లే ఈ పదానికి అంత అందం వచ్చింది. వేరేవాళ్లు ఎవరైనా ఈ పేరు పెట్టుకుంటే ఇంతగా నచ్చేది కాదేమో!

ఇక "పరిమళం" గురుంచి.. పరిమళ గారు తన కవితలతో పరిమళాన్ని వెదజల్లుతున్నారు అనిపించింది. " పరిమళం... " ఆ పేరే చాలు ఓ మంచి భావం కలుగుతుంది. ఆవిడ భావాలు కూడా అలాగే ఉన్నాయి.' గండు తుమ్మెదవు ' అంటూ తన స్వచ్ఛమైన ప్రేమను తెలియజేస్తూ మగవాళ్లని సున్నితంగా విమర్శించారు. ఆ కవిత చాలా నచ్చింది.ఇక ' వెతుకుతున్నా ఇంకా ' అనే కవిత చదివాక.. పొన్న చెట్టు నీడలో కృష్ణుడు కోసం ఎదురుచూస్తున్న రాధలా అనిపించారు. ఆ కవితలో చాలా లోతు ఉంది. ఇంకా ' అశ్రువు ', ' సూర్యుచంద్రులమా ', ' చెలీ ', ' మరునికుమారునివా ' అనే కవితలు పిచ్చిపిచ్చిగా నచ్చేసాయి.

               పేర్లులో ఏముంది అనుకుంటాం! కాని చాలా ఉంది అని ఇప్పుడే అర్థమైంది. కేవలం పేర్లే నాతో ఇప్పుడు ఇలా మాట్లాడనిస్తున్నాయి అంటే నేనే నమ్మలేకపోతున్నాను. పేరులోని మహత్తు అర్థమయ్యాక నా బ్లాగుకి ఏ పేరు పెడదాం అని ఆలోచించాను. ఏదైనా మనసుకి హత్తుకునేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇలా అలోచించాక "సవ్వడి", "ఇష్టం" అనే రెండు పేర్లు తట్టాయి. రెండూ నచ్చాయి. వీటిలో సవ్వడే కొంచం ఎక్కువగా నచ్చింది, బాగుందనిపించింది. పెట్టేశాను.

              ఇక కేప్షన్ కింద " ఇది ఓ గుండె సవ్వడి " అని పెడదామనుకున్నా! అలా పెడితే కేవలం నాగురించే చెప్పాల్సివస్తుంది. కాని నాకు అందరి తెరుపున చెప్పడం ఇష్టం. మన గురుంచి మనం చెప్పుకోవడం రొటీన్. అందరి గురించి చెప్పడం వెరైటీ అనిపించి " గుండె గుండెకో సవ్వడి " అని పెట్టాను.
              ఇప్పుడు అర్థమైనదేంటంటే... అందరి గురించి చెప్పేది వారిపై మన అభిప్రాయమే కాని వారి ' గుండె సవ్వడి ' కాదని. పోనీలెండి పెట్టేశాం కదా! అలాగే ఉండనివ్వండి.

              చివరగా నా కోరికేంటంటే.. ఒక్కసారైనా ఈ బ్లాగుని స్వాతి గారు, పరిమళ గారు చూస్తే చాలు.
మళ్లీ కలుద్దాం...

బాయ్ !

19 comments:

Padmarpita said...

స్వాగతం మీకు మన బ్లాగ్ లోకానికి!

సవ్వడి said...

just for cecking

సవ్వడి said...

పద్మార్పిత గారు మీకు ధన్యవాదాలు. మీరే మొదటసారి నా బ్లాగుని చూసారు. మిమ్మల్ని మరిచిపోను.

carthik said...

తన గుండె సవ్వడిని ప్రపంచానికి వినిపిస్తారు ఎక్కువ మంది కవులు ...
కాని ప్రపంచంలో అందరి గుండెల సవ్వడిని కొద్ది మంది మాత్రమే వినిపించగలరు.... అల్లాంటి వారిలో ఒకరు " శ్రీశ్రీ " ..

మన భావనలు మనం అనుభవించినవి (అనుభావిస్తున్నవి ) కాబట్టి రాయడం సులువే కాని ఎదుటి వారి భావాలను రాయాలంటే చాలా చాలా కష్టం ...

మీరు అందరి గుండెల సవ్వడిని అర్థం చేసుకుని అద్భుతం గా అందిస్తారని.. భావిస్తూ
మీకు తెలుగు బ్లాగుల లోకానికి స్వాగతం సుస్వాగతం :)

అన్నట్టు మీ బ్లాగు templet చాలా చాలా బాగుంది :)

please disable word verification :)

cartheek said...

ippudu meeru meeblog lo sign-in avvaakunda oka saari coment chesi choodandi..

word verification vall chaala ibbandi gaa undi...

నేస్తం said...

ముందు గా బ్లాగ్లోకానికి స్వాగతం :) తరువాతా టెంప్లెట్ సూపర్ ,ఇక మీ పోస్ట్ చాలా అమాయకం గా ఆహ్లాదం గా ఉంది. బ్లాగ్ లోకానికి వచ్చిన తొలి నాళ్ళు కదా అందుకే అమాయకత్వం అన్నమాట ..ముందు ముందు మన మొదటి పోస్ట్లు మనకు భలే సరదాగా అనిపిస్తాయి చదువుతుంటే :)

సవ్వడి said...

కార్తీక్ గారు! మీరిచ్చినటువంటి స్పందన కోసమే ఎదురుచూస్తున్నా. మీ ప్రొత్సాహానికి చాలా థాంక్స్. నా అభిమతం కూడా అదే.. అందరినీ అర్థం చేసుకుని రాయాలని. కష్టమనిపిస్తుంది. కాని ప్రయత్నిస్తాను.

సవ్వడి said...

నేస్తం గారు! మీకు ఆహ్లాదపరిచింది కదా చాలు. కాకపోతే అమాయకంగా ఉందన్నారు.. అదే నాకు అర్థం కాలేదు.

ఓ చిన్న మాట: మీకే కాదు నా బ్లాగులోకి వచ్చినవారందరికీ చెప్తున్నా! నన్ను సంబోధించేటప్పుడు "మీకు" అని కాకుండా "నీకు" అనండి చాలు.

నిషిగంధ said...

బ్లాగులోకానికి స్వాగతం.. మీ గుండె సవ్వడిని తరచుగా మాకు వినిపించాలి మరి.. నేస్తం చెప్పినట్లే మీ టెంప్లేట్ చాలా బావుంది :-)

విశ్వ ప్రేమికుడు said...

ముందుగా బ్లాగులోకానికి స్వాగతం. సవ్వడి పేరు చాలా.... బాగుంది.

టాగ్ లైన్ : ఎన్నెన్నో ఊసుల / ఊహల అలజడి

ఎన్నెన్నో ఊహల ఒరవడి/ తొలి నుడి

ఇలాకూడా ప్రయత్నించ వచ్చేమో...

మెతుకు చూసి చెప్పేస్తున్నా మిత్రమా మీ గుండెకు లోతెక్కువ. అది చేసే సవ్వడీ ఎక్కువగానే ఉంటుది. అందుకే మీతో దోస్తీ కడుతున్నా. :)

సవ్వడి said...

నిషిగంధ గారు ధన్యవాదాలు.

విశ్వప్రేమికుడు గారు మీకు కూడా ధన్యవాదాలు. మీరు చెప్పిన టేగ్ లైన్స్ కూడా బాగున్నయి. వాటి గురించే ఆలోచిస్తున్నా!

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

savvadi ... baagundi nee varavadi...
chestondi,,gundenu tadi..reputondi edo alajadi..
choosaavaa epudainaa naa blogs lo adugidi..
vacchesey maa yintiki vadi vadi..

mamamanthaa unnaamu kavithalatho mudivadi..
ilaa manam kalavadame vidhi chese gaaradi..

sadaa
nee snehaabhilaashi
raki
www.raki9-4u.blogspot.com
www.rakigita9-4u.blogspot.com
www.raki9dash4u.wordpress.com

సవ్వడి said...

రాఖీ గారు మీకు చాలా ధన్యవాదాలు. మీ అభిమానం కి కూడా..

అన్నట్టు మీ కవిత బాగుంది.

పరిమళం said...

ముందుగా నా బ్లాగ్ పోస్ట్ లో మీ కామెంట్ చూశాను ....నా బ్లాగ్ కూడా ఒకరికి స్ఫూర్తినిస్తుందా అని ఆశ్చర్యం కలిగింది .కొన్నిపర్సనల్ పనులవల్ల వెంటనే చూడలేక పోయాను ...ఇప్పుడు చూశాక ...మీ వివరణ చదివాక ..సంతోషం కలిగింది .ఏదో మనసులో కలిగిన ఆనందం , ఆక్రోశం , ఉక్రోషం :) అప్పటికప్పుడు కాగితం మీద పెట్టి బరువు దించేసుకుంటాను ..అంతే తప్ప సరిఐన భాషాపరిజ్ఞానం కూడా లేని నా పిచ్చి రాతలు మీకు పిచ్చి పిచ్చిగా :) నచ్చేసినందుకు చాలా చాలా థాంక్స్ !అలాగే బ్లాగ్ లోకానికి సుస్వాగతం మిత్రమా !

జయ said...

మీ భావాలు చాలా బాగున్నాయి 'సవ్వడి ' గారు. కంగ్రాట్యులేషన్స్.

అభిసారిక said...

Mee blog template chala bavundi:)

సవ్వడి said...

పరిమళ గారు ఇప్పటకైనా నా బ్లాగు చూసినందుకు సంతోషంగా ఉంది. నేను సందేశం పెట్టాక కూడా మీరు చూడకపోయేసరికి బాధ పడ్డాను. నాకు స్పూర్తినిచ్చిన వాళ్లలో ఒకరైనా చూస్తే బాగుండేది అనుకున్నాను. మీరు చూసారు చాలు. మీకు కలిగే ఆనందం.. ఆక్రోశం.. ఉక్రోషం.. మీలో అందమైన భావపరంపరకు కారణమౌతున్నాయంటే మిమ్మల్ని అభినందించాల్సిందే! అలా రాసిన రచియతలే గొప్ప రచయితలు ఐయ్యారు. ఎక్కువ కాలం ఉండగలిగారు.

నాకు కవితలు రాయడం రాదు. మీ స్పూర్తితో ఒక్క కవిత ఐనా రాయాలనుకుంటున్నాను. అంత మంచి కవితలు రాస్తూ.. నాకు, నాలాంటివారికి స్పూర్తినిస్తారని ఆశిస్తూ.. మీ సమాధానం కోసం ఎదరుచూస్తుంటా!

జయ గారు నా భావాలు నచ్చినందుకు థాంక్స్.

అభిసారిక గారు నా టెంప్లేట్ నచ్చినందుకు థాంక్స్.

పరిమళం said...

స్ఫూర్తి లాంటి పెద్ద పెద్ద మాటలు మనకొద్దు కానీ ....మీరు మంచి కవితలతో , టపాలతో మీ హృదయపు సవ్వడిని మా అందరితో పంచుకోవాలని ఆకాంక్షిస్తూ ....ఆల్ ది బెస్ట్ !

సవ్వడి said...

పరిమళ గారు! ఎంత మాట అన్నారు.. అసలు మీ బ్లాగు చూసే నేను బ్లాగులోకానికి వచ్చాను. మీ కవితలు చదివాక.. కవిని కూడా అవ్వాలనుకున్నాను. మీ స్పూర్తే కదా కారణం.అలాంటిది "స్పూర్తి లాంటి పెద్ద మాటలు మనకొద్దు" అంటారా... నేను ఖండిస్తున్నాను. ఒకసారి ఒకరి ప్రభావం మనపైన పడిందంటే అది చాలా కాలం ఉంటుంది. దాన్ని అలాగే ఉండనివ్వండి.