30.12.09

పడుకున్నప్పుడు ముద్దు పెట్టాను




ఎవరికి అంటారా.. నా మరదలుకి. ఎప్పుడంటారా ముద్దొచ్చినప్పుడు. బాగా చెప్పాను కదా!

           నా మరదలుకి చాలా పేర్లు ఉన్నాయి. 'రాకాసి', 'భూతం', 'దెయ్యం'.. ఇవి తను అల్లరి చేసినప్పుడు మేము పిలిచే ముద్దు పేర్లు. ఇక 'బంగారం', 'బుజ్జి', 'తల్లీ', 'బంగారు తల్లీ'.. ఎప్పూడూ పిలిచే పేర్లు.

          ఇక తన గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటీ చెప్తాను వినండి.

          మొదట ఏం చెప్దాం! ఆ... తన భోజనం గురించి చెప్తాను వినండి. ఎక్కడైనా ఇరవై రెండు నెలల పాప(అదేనండి మరో రెండు నెలలు నిండితే రెండు సంవత్సరాలు అవుతాయి) భోజనం చేయడం చూశారా! చూశాం అంటారేమో.. ఒకరు తినిపిస్తే తినడం కాదు. తనకు తనే తినడం అదీ సంవత్సరం వయసున్నప్పుడునుంచి!

         ఎలా అలవాటైందంటే.. మా అత్తయ్య తినిపించేటప్పుడు తను కూడా కంచంలో చెయ్యి పెట్టేది. అత్తయ్య అడ్డు చెప్పలేదు. కొన్నిరోజులయ్యాక మధ్యమధ్యలో ఒక్కో ముద్ద తినేది. మరి కొన్ని రోజులు పోయాక పూర్తిగా తనే తింటుంది. ఇప్పుడు మేం చెయ్యి పెడితే ఒప్పుకోదు. ఆ చెయ్యి కడుక్కున్నంతవరకూ గొడవే!
  
          తన భోజనం టైమ్ వేరు.. మా భోజనాల టైమ్ వేరు. మేము తినేటప్పుడు అది మా పక్కనే ఉంటే తినిపించేవాళ్లం. అలాగే తను తినేటప్పుడు అప్పుడప్పుడు మాకు తినిపించేది.

           ఒకసారి తను చేతితో ముద్ద తీసి నావైపు చూపించి " బావ! ఆ... " అంది నాకు తినిపించాలని.

           అది తినేదే ఇంతరవ్వ.. అదైనా పూర్తిగా తినాలని " నువ్వే తిను " అన్నాను.

          " ఆ.. " అని మళ్లీ నాకే నోరు తెరవమంది.

          " ఆమ్ చేసేయ్ తల్లీ! " అన్నాను.

          "ఆ.." అని మరొకసారి అంది. నేను వెళ్లకపోయేసరికి " నేను తినిపిస్తే తినవా.. నేనూ తినను." అనుకుని నామీద తనకున్న ప్రేమనంతా చూపించి ఆ ముద్దని విసిరికొట్టింది.

           అప్పటినుంచి తను తినిపించాలనుకున్న ప్రతీసారి.. నేను ఏం చేస్తున్నా, ఎంత దూరంలో ఉన్నా తన ముందుండేవాణ్ణి. మా అమ్మ, నాన్న పిలిచినప్పుడు కూడా అంతవేగంగా ఎప్పుడూ వెళ్లలేదు.

          ఇక రెండోది.. మా తల్లిగారికి తిరగడం అంటే చాలా ఇష్టం. " షికారు " అనే పదం వినపడగానే... ఏడుస్తున్నా, తింటున్నా, బట్టలు లేకపోయినా రెడీ ఐపోతుంది. అప్పటివరకూ ఉన్న ఏడుపంతా మాయమైపోతుంది.

          ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే "షికారు" అనగానే ఎవరితోనైనా వెళ్లిపోతుంది. మేమే ఉండవలసిన అవసరం లేదు. కొన్ని నెలల క్రితం.. బహుశా అప్పుడు తనకి సంవత్సరం దాటి ఉంటుంది.

            ఒకరోజు రాత్రి మా మావయ్య స్నేహితుడు వేణు గారు వచ్చారు. ఆయన తిరిగి వెళ్తుండగా మేము కూడా బైటకు వెళ్లాం.

          "ఏయ్ నాతో వస్తావా! " అంటూ మా బంగారం వైపు చేతులు చాపారు. ఇది వెళ్లలేదు.

          " షికారు అనండి వస్తుంది " అని ఎవరమో చెప్పాం.

          " షికారు వెళ్దాం " అని ఆయన అన్నారు. వెంటనే వెళ్లొపోయింది. ఆయన బండిమీద ముందుకి కూర్చొండబెట్టుకొని వెళ్లిపోయారు.

           అప్పుడు రాత్రి 9-00 గంటలు. వీధిలో కరెంట్ లేదు. మేమేంటి ఆయన ఒక రౌండ్ వేసి తెచ్చేస్తారు అనుకున్నాం. కానీ ఎంతకీ రారు. పది నిమషాలైంది. ఐనా రారు. మేము అలా మాట్లాడుకుంటూ బైట ఉన్న మెట్లుమీద కూర్చున్నాం.

            అప్పటికి మరో పది నిమషాలు తరువాత చేతిలో "కాకీ"తో ప్రత్యక్షమైంది. కాకీ అంటే ఏంటో అనుకుంటున్నారా.. మా తల్లిగారి భాషలో చాక్లెట్.

           మాకు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వేరే వ్యక్తితో ఇరవై నిమషాలు ఎలా ఉండిపోయిందా అని.

            మరోసారి నేను మా తల్లిగారిని బండిమీద తీసుకెళ్లాను. కొంచం దూరం వెళ్లాను. అక్కడ పని ఐన తరువాత తిరిగి వస్తుండగా కొంతసేపట్లోనే.. బ్రేక్ వేస్తే చాలు ముందుకి తూలిపడిపోతుంది. ప్రతీసారీ అలాగే! నాకేం అర్థం కాలేదు. ఈ ట్రాఫిక్ లో మాటకి బ్రేక్ కొట్టాల్సివస్తుంది. ఇదేమో పడిపోతుంది. పోనీ ఒక్కచేత్తో తొక్కుదాం అంటే కుదరదు. గేర్ బళ్లు మనల్ని కష్టపెట్టందే ముందుకు సాగవు(బండిమీద దూరం వెళ్లినప్పుడల్లా నాకు అలాగే అనిపిస్తుంది). ఎలాగో సగం దూరం వచ్చాక బండి పక్కన ఆపి ఎందుకు పడిపోతుందో చూసాను.

            చూసాక చిన్న షాక్ తగిలింది. తనేమో చక్కగా పడుకుండిపోయింది. అందుకే బ్రేక్ కొట్టిన ప్రతీసారి ముందుకు పడిపోతుంది. అప్పుడు కనిపించాయి చుక్కలు. ఇంకా సగం దూం ఉంది.

           అప్పటివరకూ ట్రాఫిక్ ని తిట్టని నేను.. దారిలో బండి అడ్డం వచ్చినా, కారు అడ్డం వచ్చినా వాళ్లని తిడుతూనే ఉన్నాను. " ఈ వెదవలకి డ్రైవింగ్ అస్సలు రాదు. అడ్డంగా వస్తున్నారు." అని తిట్టుకున్నాను. వాళ్లనే కాదు అడ్డంగా వస్తున్న మనుషులని చివరికి రోడ్డుని కూడా తిడుతూ ఇంటికి వస్తున్నాను.

          హమ్మయ్య ఇల్లు దగ్గరకి వచ్చేసింది అని అనుకుంటుండగా మూడు స్పీడ్ బేకర్లు అడ్డం వచ్చాయి. ఇల్లు దగ్గరకొచ్చినా నీ కష్టాలు తగ్గలేదు అని చెప్పాయి.

          మా వీధిలోనే స్కూల్ ఉండడంతో ఆ బేకర్లు పెట్టారు. ఆ స్కూల్ ని, బేకర్లుని తిట్టుకుంటూ ఇంటికి చేరేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.

           మరో విషయం ఏంటంటే తల్లిగారు ఈమధ్యనే చిక్కడం నేర్చుకుంది. ఒకసారి తనేదో చెప్పింది. నేను చెయ్యలేదు. అంతే కోపం వచ్చి చిక్కింది. " రాక్షసి " అన్నాను గట్టిగా... వాళ్ల నాన్న వచ్చి దాన్ని తీసుకుని " ఏం చేసింది " అన్నారు.


         " చిక్కీసింది " అని నా ముఖాన్నిచూపించాను. అప్పటికే నా బుగ్గమీద తట్టు లేచింది. మా మావయ్య అది చూసి తల్లిగారిచేత ముద్దు పెట్టించారు. ఎంత బాగా ముద్దు పెట్టిందంటే.. సంపెంగ పువ్వుపై సీతాకోకచిలుక వాలినట్లుగా సున్నితంగా ముద్దు పెట్టింది.

           ఇటువంటి నా మరదలు ... ఒకసారి నేను ఇంటికెళ్లేసరికి యువరాణిలా మంచం మీద పడుకుంది. దాని ఉంగరాల జుత్తు.. బుల్లి బుగ్గలు.. చిట్టి పెదవులు.. చూడగానే ముద్దు పెట్టేయాఅలనిపించింది(ఎవరి మరదలు వారికి ముద్దు).

            ఆ తరువాత నేను నెమ్మదిగా తన దగ్గరికి వెళ్లి తన నుదురుపై ముద్దు పెట్టాను. అది కదలకపోయేసరికి బుగ్గమీద ముద్దు పెట్టాను. మళ్లీ పెట్టాలనిపించింది కాని అదెక్కడ లెగిసిపోతుందో అని పెట్టలేదు.

           ఆ సమయంలో మన మనసు భలేగుంటుందే.. తల్లిగారిని లేపొద్దనిచెప్తుంటుంది. ముద్దులు పెట్టమనీచెప్తుంటుంది. ఏం చేస్తాం! కొన్ని క్షణాలు అంతే.. అందంగా ఆనందంగా ఉంటాయి.

ఇంతకీ మా బంగారు తల్లి పేరు చెప్పలేదు కదా.. ప్రణవి శ్రీ.

25 comments:

Rani said...

cute :)

durgeswara said...

బుజ్జి తల్లి చాలా బావుంది

Phani Yalamanchili said...

బావుంది అండి మీ పోస్ట్ ......

ఇంతకీ చిక్కడం అంటే గిచ్చాడమేనా ??

కెక్యూబ్ వర్మ said...

cute maradalu

Anonymous said...

chikkadam ante gichhadam..

tattu ante vaata ..

maadi seekkulame..:)

BADRI

budugu said...

భలే వారండి మీరు..పాపాయి బండి మీద పడుకుంటే ట్రాఫిక్‌ని తిట్టుకుంటారా? బండి ఉన్న పలాన పార్క్ చేసి ఆటోలో వెళ్ళి దించి అదే ఆటోలో వచ్చి బండి తీసుకెళ్ళాలి. నన్నడిగితే రెండేళ్ళు దాటని పిల్లల్ని బండి మీద తీసుకెల్లొద్దు. తప్పని సరై కూర్చోబెట్టుకున్నా వాళ్ళ కాళ్ళని సాఫ్ట్‌గా మీ కాళ్ళతో లాక్ చేయాలి.

Unknown said...

బాగుంది మీ బుజ్జి మరదలు, మీ narration కూడా..
చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎంత ముద్దుగా ఉంటారో .. I cann't resist stop kissing them !

:)

బుడుగు గారు చెప్పినట్లు అంత చిన్న పిల్లలని బైకు మీదా తీసుకెళ్ళటం చాలా ప్రమాదం.

sunita said...

బాగున్నదండీ మీ చిట్టిమరదలు. క్యూట్ గా.

Padmarpita said...

ఓ! సో క్యూట్ బుజ్జి మరదలు:)

నిషిగంధ said...

awwww! SO SWEET! :-)

anitha said...

choo chweet andi..

సుజాత వేల్పూరి said...

లాభం లేదు. మీ మరదలు కోసమైనా మీరు అర్జెంటుగా కారు కొనాలి.

Anonymous said...

నా మేనకోడలికోస౦ నేను కారు కొనేసా!! అచ్చ౦ మీ మరదలి లాగానే చేస్తు౦ది తను.

Indian Minerva said...

ఇంతకీ మీ బుల్లి రాక్షసి పేరేంటో చెప్పలేదు.

monkey2man said...

నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html

విశ్వ ప్రేమికుడు said...

మీకు, మీ చిట్టి మరదలు ప్రణవి శ్రీకి Happy new year.

సవ్వడి said...

hi friends!
i am really sorry. it was so late to respond you..
thanks a lot to every one and special thanks to few friends, who visited my blog for first time .
i promise you now.. i will respond when ever i receive comments on my next postings.

నేస్తం said...

చాలా బాగా రాసారు.చాలా రోజుల తరువాత నెట్ ఓపెన్ చేసాను..అందుకే మిస్ అయ్యాను ...చక్కని పోస్ట్ ..చదివినా వాళ్ళు చాలా హాయిగా ఫీల్ అవుతారు.

సవ్వడి said...

నేస్తం గారు! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

మధురవాణి said...

So sweet :)

పరిమళం said...

మాకూ ఉన్నాడొక బుడుగుగాడు మీ ప్రణవి లాగే ...వాడూ అంతే షికారుకి ముందుంటాడు ఒక "మాజా "కొనిస్తే చాలు వాడిని ఎవరైనా ఈజీగా కిడ్నాప్ చేసేయొచ్చు వాడిపేరు చైతన్య ముద్దుపేరు బుడ్డీ :) :) మీ మరదలి ముద్దు ముచ్చట్లు చదువుతుంటే వాడే గుర్తుకొచ్చాడు

సవ్వడి said...

మధురవాణి గారు ధన్యవాదాలు.

పరిమళ గారు చాలా రోజుల తరువాత కనిపించారు. చైతన్యను అడిగానని చెప్పండి. మీవాడి విశేషాలు కూడా టపాలో చెప్పండి. మీకు కూడా ధన్యవాదాలు.

VAMSI said...

Mee maradali photo paste cheyyandi.
Mee naration superb

Madarapu said...

ఆ సమయంలో మన మనసు భలేగుంటుందే.. లేపొద్దనిచెప్తుంటుంది. ముద్దులు పెట్టమనీచెప్తుంటుంది. ఏం చేస్తాం! కొన్ని క్షణాలు అంతే.. అందంగా ఆనందంగా
ఉంటాయి.

super line boss..... feelings ki wording iccharu.. meeru superrahe :-)

కృష్ణప్రియ said...

చాలా బాగుంది.