12.1.10

సంక్రాంతి సందడి

        సంక్రాంతి అంటేనే సందడి.. సంవత్సరాంతం గుర్తుండిపోయే సందడి. ఈ సంవత్సరంలో ఎవరు ఎప్పుడు కలిసినా మళ్లీ గుర్తుచ్చేంత సందడి. మరో సంక్రాంతి కోసం ఎదురు చూసేలా చేయించే సందడి.

        
        మొదట గుర్తుకొచ్చేది మాత్రం తాతగారి ఇల్లే. మేము, మా పిన్నివాళ్లు, మా మావయ్యవాళ్లు మొత్తం కలిసి ఇరవైమంది దాకా ఉంటాం. ఇంట్లో అడుగు పెట్టినప్పటినుండి సందడే సందడి.

        సంక్రాంతిని పల్లెటూళ్ళలోనే చూడాలంటారు. మా తాతగారు టౌన్ లోనే ఉండటం వల్ల పల్లెల్లో జరిగే సంక్రాంతిని ఇంతవరకూ చూడలేదు. అందుకే పల్లెటూరు అమ్మాయిని చేసుకోవాలనుంది. ఈ విధంగానైనా పల్లెటూరులో ఓ మూడు రోజులు హాయిగా ఉండొచ్చు.


         పల్లెటూరు అంటే ఎటు చూసినా పచ్చని పొలాలు, అందమైన చెరువులు.. ఇంకా కనిపించేంత దూరంలో తోటలు ఇలా ఉండాలి. ఉదయం విచ్చుకొనే హేమంతపు మంచుతెరల మధ్య పంట చేలల్లో నడవాలని నాకెప్పటినుంచో కోరిక. దీనికోసమైనా పల్లెటూరు అమ్మాయిని చేసుకోవాలి.

         సంక్రాంతి అనగానే ఓ పాట గుర్తొస్తుంది. అందులో ఒక దగ్గర " కొత్త అల్లుళ్ళతో కొంటె మరదళ్ళతో ఊరే ఉప్పొంగుతుంటే... " అంటూ సాగుతుంది. నిజమే మరదళ్ళుంటేనే సరదా! నా దురదృష్టమేంటో మా నాన్న తరుపునుండిగాని మా అమ్మ తరపునుండిగాని.. ఆ చివరనుండి ఈ చివరవరకూ ఒక్కరూ లేరు. నిరభ్యంతరంగా లవ్ చేసుకుందామంటే వరసకొచ్చినవాళ్లు ఒక్కరూ లేరు. ప్ల్చ్.. దీన్నే విధి అంటారు.


         ఇంతకీ ఆ పాటలో చెప్పింది భార్య చెల్లెళ్ళ గురించి అనుకుంటా! ఆ.. వాళ్లగురించి మాట్లాటడం దేనికిలెండి. " ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం " అన్నాడట. నేను ఇప్పుడు వాళ్ల గురించి మాట్లాడితే.. మీరు కూడా నన్ను అలాగే తిడతారు. అందుకే మాట్లాడదలచుకోలేదు. వాళ్లనేమంటారండి.. అదేనండి భార్య చెల్లెళ్ళని. ఆ పదమే ఎప్పుడు వినలేదు. ఏదో 'మ' తో ప్రారంభమౌతుందనుకుంటా(ఈ పేరా వరకూ అంతే )!

         అదండి సంగతి. సంక్రాంతి విశేషాలతో మళ్లీ కలుస్తా!


         ముందుగా