12.1.10

సంక్రాంతి సందడి

        సంక్రాంతి అంటేనే సందడి.. సంవత్సరాంతం గుర్తుండిపోయే సందడి. ఈ సంవత్సరంలో ఎవరు ఎప్పుడు కలిసినా మళ్లీ గుర్తుచ్చేంత సందడి. మరో సంక్రాంతి కోసం ఎదురు చూసేలా చేయించే సందడి.

        
        మొదట గుర్తుకొచ్చేది మాత్రం తాతగారి ఇల్లే. మేము, మా పిన్నివాళ్లు, మా మావయ్యవాళ్లు మొత్తం కలిసి ఇరవైమంది దాకా ఉంటాం. ఇంట్లో అడుగు పెట్టినప్పటినుండి సందడే సందడి.

        సంక్రాంతిని పల్లెటూళ్ళలోనే చూడాలంటారు. మా తాతగారు టౌన్ లోనే ఉండటం వల్ల పల్లెల్లో జరిగే సంక్రాంతిని ఇంతవరకూ చూడలేదు. అందుకే పల్లెటూరు అమ్మాయిని చేసుకోవాలనుంది. ఈ విధంగానైనా పల్లెటూరులో ఓ మూడు రోజులు హాయిగా ఉండొచ్చు.


         పల్లెటూరు అంటే ఎటు చూసినా పచ్చని పొలాలు, అందమైన చెరువులు.. ఇంకా కనిపించేంత దూరంలో తోటలు ఇలా ఉండాలి. ఉదయం విచ్చుకొనే హేమంతపు మంచుతెరల మధ్య పంట చేలల్లో నడవాలని నాకెప్పటినుంచో కోరిక. దీనికోసమైనా పల్లెటూరు అమ్మాయిని చేసుకోవాలి.

         సంక్రాంతి అనగానే ఓ పాట గుర్తొస్తుంది. అందులో ఒక దగ్గర " కొత్త అల్లుళ్ళతో కొంటె మరదళ్ళతో ఊరే ఉప్పొంగుతుంటే... " అంటూ సాగుతుంది. నిజమే మరదళ్ళుంటేనే సరదా! నా దురదృష్టమేంటో మా నాన్న తరుపునుండిగాని మా అమ్మ తరపునుండిగాని.. ఆ చివరనుండి ఈ చివరవరకూ ఒక్కరూ లేరు. నిరభ్యంతరంగా లవ్ చేసుకుందామంటే వరసకొచ్చినవాళ్లు ఒక్కరూ లేరు. ప్ల్చ్.. దీన్నే విధి అంటారు.


         ఇంతకీ ఆ పాటలో చెప్పింది భార్య చెల్లెళ్ళ గురించి అనుకుంటా! ఆ.. వాళ్లగురించి మాట్లాటడం దేనికిలెండి. " ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం " అన్నాడట. నేను ఇప్పుడు వాళ్ల గురించి మాట్లాడితే.. మీరు కూడా నన్ను అలాగే తిడతారు. అందుకే మాట్లాడదలచుకోలేదు. వాళ్లనేమంటారండి.. అదేనండి భార్య చెల్లెళ్ళని. ఆ పదమే ఎప్పుడు వినలేదు. ఏదో 'మ' తో ప్రారంభమౌతుందనుకుంటా(ఈ పేరా వరకూ అంతే )!

         అదండి సంగతి. సంక్రాంతి విశేషాలతో మళ్లీ కలుస్తా!


         ముందుగా







15 comments:

భావన said...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. బాగుందండి. పొలాలలో నడవటం కోసం పల్లెటూరి అమ్మాయి ను చేసుకుంటారా. మంచి రీజన్. ;-)

Padmarpita said...

బావా బావా పన్నీరు అంటే పర్వాలేదు తన్నేరు అంటేనే కష్టం ఆలోచించుకోండి:):)
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

సవ్వడి said...

భావన గారు చాలా రోజుల తరువాత పల్కరించారు. ధన్యవాదాలు.

పద్మ గారు! ఒక్క మరదలు లేదని నేను ఏడుస్తుంటే మీ సెటైర్లు ఏంటండి. మనలో మన మాట మీ బావని బాగా ఏడిపిస్తున్నట్లున్నారు. మీకు ధన్యవాదాలు.

మాలా కుమార్ గారు ధన్యవాదాలు.

webtelugu said...

Wats your rank in webtelugu topsites??

WEBTELUGU.COM the Telugu topsites directory

Hai friend add your blog/website to webtelugu.com and get more traffic for your site .Its a new telugu topsite directory .Your blog readers vote for your site also ... go and add your site herehttp://www.webtelugu.com/

simplesoul said...

bagundandi.. pandakki tatagarintiki velladam.. andarito kalisi melisi gadapadam... mee post na jnapakalani kooda nidra lepindi..

good luck andi, meeku chakkati chellellunna palletoori ammayi dorakalani abhilashisthunna!

simplesoul said...

by the way, na chinna tanam lo chala yellu srikakulam lo gadapadam valla naku srikakulam ante chala ishtam. glad to see that you are from srikakulam :)

సవ్వడి said...

పుత్తడి బొమ్మ గారు ఒకటే జిల్లా అనేసరికి ఆసక్తి పెరుగుతుందే! మీకు చాలా చాలా ధన్యవాదాలు.. నాకు మంచి అమ్మాయి రావాలని కోరుకున్నారుగా అందుకు! సింపుల్ సౌల్ అని ఎందుకు పెట్టుకున్నారో చెప్తారా..! ఇంతకీ మీదే ఊరు. శ్రీకాకుళంలో ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు.

simplesoul said...

okate jilla ane aasaktha kaadaa ani cheppalenandi, but Srikakulam ante nakoka special place endukante, na childhood memories chaala varaku srikakulam tho associate ayyi unnayi.. Srikakulam lo memu womens college eduruga undevallam..! ika simple soul vishayaniki vaste.. that is the phrase that describes me the best. nenu blogger loki maraka mundu naa website google pages lo undedi.. dani peru simple soul undedi. google pages google sites kinda maripoyi,aa interface naku nacchaka blogger loki maripoyanu. blogger lo simplesoul url available lekapovadam valla puttadi bomma ani pettalsocchindi.hope that answers your uestions :)

సవ్వడి said...

ఉమెన్స్ కాలేజ్ ఎదురుగే మా పిన్నివాళ్లు కూడా ఉండేవాళ్లు. ఇప్పుడు మారిపోయారులెండి. మీ చైల్డ్ హుడ్ అంతా ఇక్కడే సరదాగా గడిచిపోయిందన్నమాట. సరే ఈ జిల్లాలో మీకు బాగా నచ్చేది ఏంటి?

సింపుల్ సౌల్ అన్నది ఒక ఫ్రేజా.. అర్థమైందిలెండి. చదివాక మీరు మరి అంత సింపుల్ గా ఉంటారా అనిపించింది.

నేస్తం said...

పల్లెలో తిరగాలని పల్లెటూరి అమ్మాయిని చేసుకోవాలనుకున్నారా :) ..నాక్కూడా బావలు ఎవరూ లేరు ..ఒక వేళ ఉండి ఉంటే ,వాడు సకలగుణాభి రాముడు అయితే అయిపోయెవాడు..మా అమ్మాయిని చేస్తాం మా అమ్మాయిని చేస్తాం అని మా వాళ్ళు యుద్దానికి రెడీ అయిపోయెవారు..ముందు జాగ్రత్తగా దేవుడు కాపాడేసాడు :)

సవ్వడి said...

నేస్తం గారు ! నన్ను కూడా ఆ దేవుడే కాపాడాడంటారా! సరే అలాగే అనుకుందాం. మీలాంటి ముత్యాల్లాంటి అమ్మాయిలు పల్లెల్లోనే ఉంటారని నా అభిప్రాయం. అందుకే పల్లెటూరి అమ్మాతిని చేసుకోవాలనుకుంటున్నాను.

ధన్యవాదాలు.. నా బ్లాగుకు వచ్చినందుకు..

భావన said...

సంక్రాంతి తరువాత ఉగాది కూడా వస్తోంది...;-)

సవ్వడి said...

భావన గారు! నాకు కూడా మంచి టపాలు పెట్టాలని ఉంది. కాని టైమ్ చాలట్లేదు.

ఒక టపా పేపర్ మీద రాయడానికి, దాన్ని టైప్ చేయడానికి చాలా టైమ్ పడుతోంది. ప్రస్తుతానికి కామెంట్లు తోనే సర్దుకుంటున్నాను.

Kottapali said...

@ సవ్వడి - those are probably spam comments, done by programs. You may want to use anti spam method like word verification or comment moderation

annu said...

it is very nice