12.3.10

ఉగాది శుభాకాంక్షలు..



బ్లాగు స్నేహితులందరికీ హాయ్!
ఎప్పుడో క్రీస్తుపూర్వం(సంక్రాంతి సమయంలో ఒక టపా పెట్టాను) మిమ్మల్ని కలిసాను. మళ్లీ క్రీస్తుశకంలో(ఉగాది వచ్చేస్తుంది కదా) మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఇప్పుడు కూడా నాకు సమయం లేదు కాని.. మీరు నామీద బెంగ పెట్టుకుంటారని ఒకసారి కలుద్దామని వచ్చాను. ఈ పండుగకైనా మిమ్మల్ని పలకరించకపోతే ఊరుకోరని తెలిసి వచ్చానన్నమాట( ఉపోద్ఘాతం ఎక్కువయ్యిందా.. పర్వాలేదు సర్దుకోండి).

ఉగాది.. తెలుగువారికి మొట్టమొదటి పండుగ. నాకు ఇష్టమైన పండుగ. ఈరోజు నుంచే వసంతఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి ప్రకృతి అంతా చూడడానికి బాగుంటుంది. ఇంకా కొన్నిరోజులు ఐయ్యాక చక్కగా మామిడి పళ్లు తినొచ్చు. కాని మామిడి పళ్లు వచ్చినవెంటనే నాకు తినడం అవదు. ఎందుకంటే వైశాఖమాసంలో వచ్చే తదియనాడో.. త్రయోదశినాడో.. మా అమ్మ దేవుళ్లకి  మామిడి పళ్లు పెట్టి పూజ చేసినంతవరకూ మేము తినకూడదు. ఆవిధంగా అప్పటివరకూ నోరు ఊరుతున్నా చూస్తూ కూర్చోవల్సిందే!

ఇక ఉగాది రోజున ఉదయాన్నే దేవుడుకి పూజ చేసి ఉగాది పచ్చడి తిని టి.విమీద పడతాం. పంచాంగ శ్రవణం వింటే గాని మా ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టదు. ఈ ఆదాయవ్యయాలు, రాజపూజ్య అవమానాలు అందరివీ చూసాక.. వాటిమీద ఓ గంటసేపు చర్చపెట్టాక గాని మిగతా పనులు ముట్టుకోం. మధ్యలో తినడానికి మాత్రం లేస్తాం.

ఈసారి కూడా ఉగాదికి మా అమ్మ, నాన్న, తమ్ముడు మాత్రమే చేసుకుంటున్నారు. నేనేమో ఇక్కడ హైదరాబాద్ లో మావయ్యవాళ్ల ఇంట్లో చేసుకుంటున్నాను.

ముందుగా మీ అందరికీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .