12.3.10

ఉగాది శుభాకాంక్షలు..బ్లాగు స్నేహితులందరికీ హాయ్!
ఎప్పుడో క్రీస్తుపూర్వం(సంక్రాంతి సమయంలో ఒక టపా పెట్టాను) మిమ్మల్ని కలిసాను. మళ్లీ క్రీస్తుశకంలో(ఉగాది వచ్చేస్తుంది కదా) మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఇప్పుడు కూడా నాకు సమయం లేదు కాని.. మీరు నామీద బెంగ పెట్టుకుంటారని ఒకసారి కలుద్దామని వచ్చాను. ఈ పండుగకైనా మిమ్మల్ని పలకరించకపోతే ఊరుకోరని తెలిసి వచ్చానన్నమాట( ఉపోద్ఘాతం ఎక్కువయ్యిందా.. పర్వాలేదు సర్దుకోండి).

ఉగాది.. తెలుగువారికి మొట్టమొదటి పండుగ. నాకు ఇష్టమైన పండుగ. ఈరోజు నుంచే వసంతఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి ప్రకృతి అంతా చూడడానికి బాగుంటుంది. ఇంకా కొన్నిరోజులు ఐయ్యాక చక్కగా మామిడి పళ్లు తినొచ్చు. కాని మామిడి పళ్లు వచ్చినవెంటనే నాకు తినడం అవదు. ఎందుకంటే వైశాఖమాసంలో వచ్చే తదియనాడో.. త్రయోదశినాడో.. మా అమ్మ దేవుళ్లకి  మామిడి పళ్లు పెట్టి పూజ చేసినంతవరకూ మేము తినకూడదు. ఆవిధంగా అప్పటివరకూ నోరు ఊరుతున్నా చూస్తూ కూర్చోవల్సిందే!

ఇక ఉగాది రోజున ఉదయాన్నే దేవుడుకి పూజ చేసి ఉగాది పచ్చడి తిని టి.విమీద పడతాం. పంచాంగ శ్రవణం వింటే గాని మా ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టదు. ఈ ఆదాయవ్యయాలు, రాజపూజ్య అవమానాలు అందరివీ చూసాక.. వాటిమీద ఓ గంటసేపు చర్చపెట్టాక గాని మిగతా పనులు ముట్టుకోం. మధ్యలో తినడానికి మాత్రం లేస్తాం.

ఈసారి కూడా ఉగాదికి మా అమ్మ, నాన్న, తమ్ముడు మాత్రమే చేసుకుంటున్నారు. నేనేమో ఇక్కడ హైదరాబాద్ లో మావయ్యవాళ్ల ఇంట్లో చేసుకుంటున్నాను.

ముందుగా మీ అందరికీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .

11 comments:

మధురవాణి said...
This comment has been removed by the author.
మధురవాణి said...

ఈసారి ఉగాదికి మొదటి శుభాకాంక్షలు మీ దగ్గరనుంచేనండీ! నేను చెప్పే మొదటి శుభాకాంక్షలు కూడా మీకే సుమా :-)
ఈ కొత్త సంవత్సరం మీకూ మీ కుటుంబానికీ మరిన్ని సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటూ..అలాగే, కొత్త సంవత్సరంలో కాస్త తరచుగా రాస్తుండమని కోరుతూ... :-)

'Padmarpita' said...

మరి నేను కూడా మధురవాణిగారి బాటలోనే:)

నేస్తం said...

మరి ఉగాది రోజునే పోస్ట్ వేయకపోయారా..ఆ రోజు ఏం పని చేస్తే సంవత్సరం అంతా చేస్తాం అంటా :)
ఉగాది శుభాకాంక్షలు

వేణూ శ్రీకాంత్ said...

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సవ్వడి గారు. మీ అభిరుచులు చాలా బాగున్నాయ్ :-)

భావన said...

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు కృష్ణ. మరి పంచాంగ శ్రవణం విన్నాక మాకు కూడా చెపుతారా ఆ వివరాలు. :-).

సవ్వడి said...

మధురవాణి గారు ఈ ఉగాదికి మీరే నాకు మొదట శుభాకాంక్షలు చెప్పింది. ధన్యవాదాలు ( అచ్చు మీ స్టైల్ లోనే ). నాకు తరుచుగా రాయాలని ఉంది కాని కుదరట్లేదు.

పద్మ గారు మీరు నాకు శుభాకాంక్షలు చెప్పిన రెండో వ్యక్తి. ధన్యవాదాలు.

నేస్తం గారు ధన్యవాదాలు. ఉగాది రోజున నేను మావయ్య వాళ్ల ఇంట్లో ఉంటాను. అక్కడ నాకు కుదరదు కాబట్టి ముందే పెట్టేసా!

వేణు గారు ధన్యవాదాలు. ఏ అభిరుచి నచ్చిందో కాస్త చెబుతారా!

భావన గారు ధన్యవాదాలు. మీకోసమైనా ఆ వివరాలు చెప్తాను. కాకపోతే ఎప్పుడు అనేది చెప్పలేను.

శేఖర్ పెద్దగోపు said...

హలో సవ్వడి..(మరేం చేయను..మీ పేరు తెలియదుగా :))...
ఓలమ్మో ఓలమ్మో మీది శ్రీకాకుళమా?? సాన్నాల్లకి మా ఊరోడు అగుపించగానే బోల్డంత సంబడంగా ఉంది సుమా!!
టపాలు ఆలీసం సేకుండా బేగి రాసీయండి...

మురళి said...

ఇవాళే మీ బ్లాగు చదివానండీ.. బాగా రాస్తున్నారు కానీ అరుదుగా రాస్తున్నారు. కొంచం తరచుగా రాయడానికి ప్రయత్నించండి. జిమెయిల్ లో ఇప్పుడు తెలుగు రాసే సౌకర్యం ఉంది కదా.. అక్కడ రాసి బ్లాగులో పేస్ట్ చేయడం సులువుగా ఉంటుంది కొత్తగా రాసేటప్పుడు. ప్రారంభంలో అందరికీ ఉండే ఇబ్బందులేనండీ.. కొన్ని టపాలు రాస్తే అలవాటైపోతుంది రాయడం. కొమ్మనాపల్లి నవలలు అన్నీ చదివారా? బాగా నచ్చినది ఏది? కథలు ఏమన్నా రాశారా? వినాయక చవితి వరకూ ఆగకుండా కొంచం త్వరగా టపా రాయండి.. అభినందనలు..

సవ్వడి said...

శేఖర్ గారు! నా బ్లాగుకి వచ్చినందుకు ధన్యవాదాలు. వేగంగా టపాలు పెట్టడానికి ప్రయత్నిస్తాను.
మురళి గారు! మీకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు రాయడం వచ్చేసిందిలెండి. ఇకపోతే కొమ్మనాపల్లి గారిది నాకు బాగా నచ్చిన నవల "ప్రణయ ప్రబంధం". మరి మీకు నచ్చిన నవలేంటో... నేను ఇప్పటికి ఒక కథ రాసాను. ఇప్పుడు ఇంకోటి రాస్తున్నా!

మురళి said...

కొమ్మనాపల్లి 'మిస్ మేనక ఐపీఎస్' చదివారా? అప్పట్లో కొంచం బాగా నచ్చింది. ప్రణయ ప్రబంధం దూరదర్శన్ లో సీరియల్ గా వచ్చింది కదూ? మీ కథ ఎక్కడ పబ్లిష్ అయ్యిందండీ??