23.4.10

IPL WASTE... BLOGS LEAGUE BEST

BLOGS LEAGUE


ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా... ఇంతవరకూ ఏ భాషలోనూ జరగని... నభూతో నభవష్యతి అన్న విధంగా... మన తెలుగులో బ్లాగ్స్ లీగ్ జరగబోతుంది. నిర్వహిస్తున్నది ఇంకెవరో కాదు నేనే!


బ్లాగ్స్ లీగ్ ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. అది మీకు తెలియాలిగా.. చెప్తున్నా వినండి. ఐ.పి.ఎల్ వల్ల BCCI కి సంవత్సరానికి 800 కోట్లు లాభం వస్తోందట! అంత లాభం వస్తున్నప్పుడు మనం ఎందుకు ప్ర్రారంభించకూడదని ప్రారంభించాను. అంతే తప్ప పెద్ద కారణాలేవీ లేవు.

ఇప్పుడు బ్లాగులు అమ్మకానికి పెడుతున్నాను. అదేనండి ఐ.పి.ఎల్ లో ఊర్లని ఎలా అమ్మకానికి పెట్టారో ఇక్కడ బ్లాగులని అలా అమ్మకానికి పెడుతున్నాను. మీరు కొన్నవెంటనే లీగ్ ప్రారంభమైపోతుంది. ఏ బ్లాగు కొందామన్నా కనీసం వెయ్యి కోట్లు చెల్లించాలి. ఆ తరువాత ఎవరు ఎక్కువకి పాడితే వాళ్ళదే ఆ బ్లాగు. ఈ క్రింది బ్లాగులను మీరు కొనుక్కోవచ్చు...

కృశ్ణ గీతం


పరిమళం


పద్మార్పిత


ఏటి గట్టు


నెమలి కన్ను


నాలో నేను నాగురించి


శ్రీలలిత


మధురవాణి


జాజిపూలు


మానసవీణ

ఏంటి? నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఈ బ్లాగులన్నీ నావేనండి బాబు! నిజం.. కావాలంటే ఐ.పి.ఎల్. మీద ఒట్టేసి మరీ చెప్తాను. మీకో పెద్ద రహస్యం చెప్తాను వినండి. నాకు చాలా బ్లాగులు ఉన్నాయి. వాటన్నింటినీ చూసుకోవడం కష్టంగా ఉండడంతో... వాటిని చూసుకోవడానికి కొంతమంది నిర్వాహకులను నియమించాను. వాళ్లు ఎవరెవరంటే...

బ్లాగులు... నిర్వాహకులు(Managers)

కృష్ణగీతం : భావన


పరిమళం : పరిమళ


పద్మార్పిత : పద్మార్పిత


ఏటి గట్టు : శేఖర్


నెమలికన్ను : మురళి


నాలో నేను నాగురించి : వేణు శ్రీకాంత్


శ్రీలలిత : శ్రీలలిత


మధురవాణి : మధురవాణి


జాజిపూలు : నేస్తం


మానసవీణ : నిషిగంధ

వీళ్లంతా నా ఉద్యోగులనమాట. అర్థమైంది కదా....! అన్నట్టు చెప్పడం మరిచాను... వీళ్లందరికీ నెలకు లక్ష రూపాయలు జీతంగా ఇస్తున్నాను. ఏం చేస్తాం నా బ్లాగుల్ని కళ్లల్లో పెట్టుకుని మరీ చూసుకుంటున్నారు. "నువ్వు మాత్రం మా చెవుల్లో పువ్వులు బాగా పెడుతున్నావు" అని అనుకుంటున్నారా... అదేం లేదండి బాబు నిజంగా ఇవన్నీ నావే!

ఇంకా నమ్మకం కుదరట్లేదా.. ఐతే నేను చెప్పే పచ్చి నిజం వినండి. దెబ్బకి నమ్మేస్తారు. ఇప్పుడు మన "మానసవీణ" బ్లాగర్ "నిషిగంధ"గారు ఉన్నారు కదా! ఆవిడని " ఈ బ్లాగు మీదేనని సాక్షం చూపించండి " అని అడిగామనుకో.. ఆవిడ చూపించలేరు. అదే నేనైతే వంద పేజీల డాక్యుమెంట్లు చూపిస్తాను. ఆ బ్లాగు నాదేనని.. ఆవిడని నేనే బ్లాగు నిర్వాహకురాలిగా నియమించినట్లు ఉంటుంది. ఇలా ప్రతీ బ్లాగుకి నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. వాటిని చూడాలంటే నాదగ్గరకు రావల్సిందే! ఆవిడ ఎంత బాగా రాస్తారు కదా! అటువంటి గ్రేట్ ఎంప్లాయిస్ నా దగ్గర ఉన్నారు. దీనిబట్టి మీరు అర్థం చేసుకోవల్సింది ఏంటంటే... high court, supreme court, international court... ఇలా ఏ కోర్టు కెళ్లినా ఉపయోగం లేదని.! ఇప్పటికి అర్థమైంది కదా!

ఇక లీగ్ విశేషాలు వివరిస్తాను వినండి. ఐ.పి.ఎల్ లో ఒక మేచ్ మూడు నుంచి నాలుగు గంటలు జరుగుతుంది. కాని ఇక్కడ కేవలం మూడు నిమషాలే! పోటీ ఏంటంటే మూడు నిమషాల్లో "అ ఆ"లు పూర్తిగా రాసి ఎవరు ఎక్కువ పోస్టులు పెడితే వాళ్లు గెలిచినట్లు. నాకు "అ ఆ"లు రావు మరి... అందుకే వాటిమీద పెట్టాను. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. మన ఐ.పి.ఎల్. లో పది కోట్లు ఇస్తున్నారు. ఇక్కడేమో పది కోట్ల పది రూపాయలు ఇస్తున్నాను. ఎంత మంచోడిని కదా! ఇప్పటికైనా నా గొప్ప మనసును అర్థం చేసుకోండి.

ఇంకా మేచ్ షెడ్యూల్ సెట్ చేయలేదు.. కాని మొట్టమొదటి మేచ్ మాత్రం నిర్ణయించేసాను. మొదటి మేచ్... "కృష్ణ గీతం" కు "పరిమళం" కు. రేపు మీరు బ్లాగులు కొన్నవెంటనే మొత్తం మేచ్ లు.. సెమీ ఫైనల్స్, ఫైనల్ మేచ్ తెలియజేస్తాను.

ఐ.పి.ఎల్.-3 విలువ 19,000 కోట్లు అట.. దాన్ని మన బ్లాగ్స్ లీగ్ మొదటిసారే దాటేయాలని కోరుకోండి.

మరో విషయం ఐ.పి.ఎల్.-3 లో ఫిక్సింగ్ జరిగినట్లు సమాచారం అందింది. ఇక్కడ అలా జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ బ్లాగర్ల చిరునామాలు, ఫోన్ నెంబర్లు నాకు తప్ప మూడో కంటికి కూడా తెలీదు. కాబట్టి నిర్భయంగా ఉండండి. ఇదీ కమామీషు.. వెంటనే కొనేయండి.

ఇంకా చాలా ఫేమస్ బ్లాగులు ఉండిపోయాయి. వాటిని నాకు తెలియజేస్తే నా బ్లాగ్స్ లీగ్-2 లో అమ్మేస్తాను. అలా చూస్తేనే ఒళ్లు మండుతుంది. ఆ బ్లాగులు కూడా నావే... ఎప్పుడో దానం చేసేసాను. ఇప్పుడు గుర్తులేదు అంతే!

19 comments:

sowmya said...

హ హ హ బావుంది కానీ నేను కొనుక్కోలేను, కోట్ల రూపాయలు నా దగ్గర లేవు. కానీ ఒక 12 మంచి టపాలున్నాయి. అవి ఇచ్చేస్తాను. తీసుకుని ఏదో ఒక టీం ని నాకిచ్చేయండి. ఖచ్చితంగా గెలిపించి తీరుతాను. ఏమంటారు?

Rishi said...

baagundadee tapa saradaagaa.Keep it up.poorvaasramam lo asalu nene kaddo meeku aa blaagu lu icchindi.naa peru kaneesam talachukoledu meeru.nenu khandistunnaa.

మురళి said...

ఇంతకీ మీరు లలిత్ మోడీనా శశి థరూరా?? :-) :-)

'Padmarpita' said...

నా షేర్ ని పక్కపెట్టండి....మరచిపోకండేం!

నేస్తం said...

అంతా బాగానే ఉంది కాని పరమ క్రికెట్ ద్వేషినైన నా బ్లాగ్ని క్రికెట్ ipl తో పోల్చడం నాకు నచ్చలేదు :/

సవ్వడి said...

సౌమ్య గారు నా బ్లాగుకి వచ్చినందుకు ధన్యవాదాలు. వెంటనే ఆ 12 టపాలు ఇచ్చేయండి. నేను రాయలేకపోతున్నాను. నెలకొకటి పెట్టుకుంటాను.మీకు ఏ టీమ్ కావాలంటే ఆ టీమ్ ఇచ్చేస్తాను. ఏది కావాలో చెప్పండి. అసలే దానకర్ణుడిని...
రిషి గారు మీకు కూడా ధన్యవాదాలు. పూర్వాశ్రమంలొ కేవలం బ్లాగు ఎలా క్రియేట్ చేసుకోవాలో అని మాత్రమే అడిగాను. దానికే.. అన్నీ మీరే ఇచ్చానంటే ఎలా?
మురళి గారు! నేను రాజకీయవేత్తను కాను కాబట్టి థరూర్ని కాను. ఈ లీగ్లో ఫిక్సింగ్ చేయించలేదు కాబట్టి మోడిని కాను. నేను నేనే.
పద్మ గారు! మీ పేరు ఎందుకు పక్కన పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. మీలా నేను ఒక్క లైన్ కూడా కవిత రాయలేను.
నేస్తం గారు! నేను కూడా క్రికెట్ ద్వేషినే కాకపోతే మీ రేంజ్ లో కాదు. అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇకపోతే మీ బ్లాగుని ఒక టీమ్ తో మాత్రమే పోల్చాను. క్రికెట్ తో కాదు.

మధురవాణి said...

:-D :-D
హ హ్హ హ్హా.. బాగుంది మీ అయిడియా!
blogs league లో నా బ్లాగు పేరు కూడా ఉందే! :-)
మొత్తానికి పేద్ద బృహత్తర కార్యక్రమాన్నే తలకెత్తుకున్నారు.
విజయోస్తు :-)

సవ్వడి said...

మధురవాణి గారు! ఏదో సరదాగా ఉంటుందని రాసాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

విశ్వ ప్రేమికుడు said...

నేను కూడా చాలా పేద బ్లాగరుని. డబ్బులు నేను మీకివ్వడం కష్టం కనుక మీరే నాకు గౌరవ వేతనంగా ఓ 10లక్షలో 20 లక్షలో చెల్లిస్తే న్యాయనిర్ణేతగా ఉండి ఈ లీగ్ ను ముందుకు నడిపిస్తాను. విశ్వప్రేమికుడిని కాబట్టి నాకు ఒకళ్లు ఎక్కువ ఒకళ్లు తక్కువా కాదు. అందువలన నిష్పక్షపాతమైన నిర్ణయాలు తీసుకుని మన బ్లాగులోకానికే పేరు తెస్తానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. :D

సవ్వడి said...

మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. మీరే దగ్గరుండి ఈ లీగ్ ని నిర్వహించాలి మరి...

జ్యోతి said...

బ్లాగ్ గురువులో సాంకేతిక సమస్య వల్ల మీకు రిప్లై ఇవ్వలేకున్నాను. మీరు బ్లాగులో లాగిన్ అయ్యాక కామెంట్లు చూడండి. ప్రతి కామెంట్ క్రింద చిన్న గుర్తు( తాళం) లాంటిది ఉంటుంది. అధి క్లిక్ చేసి కామెంట్ పర్మనెంటుగా డిలీట్ చేయండి. అంతే.. సెట్టింగ్స్ లో కామెంట్స్ విబాగంలో వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి..

భావన said...

ఏం కృష్ణ పెద్ద గా గిట్టు బాటు ఐనట్లు లేదు మీ లీగ్.. ;-) ఎన్ని కోట్లు చేసేవేం ఇప్పటి దాక?

సవ్వడి said...

భావన గారు! అస్సలు గిట్టుబాటు కాలేదు. మీరైనా ఓ న్లాగు కొనాల్సింది.

శేఖర్ పెద్దగోపు said...

భలే వారే మీరు..:-)

సవ్వడి said...

శేఖర్! నేనేం చేసానండి.

పరిమళం said...

హమ్మో ...మాకు నెలకో లక్ష ఇచ్చి మీరేమో కోట్లు సంపాదించేద్దాం అనుకున్నారా .....హమ్మా ...అందుకే మరి :) అన్నట్టు పోయిన్నెల అంటే సెలవులో ఉన్నా ...ఈ నెల జీతం ఇంకా అందనేలేదు :)

సవ్వడి said...

పరిమళ గారు పంపించిసానే! కొరియర్ వాడు నొక్కేసుంటాడు.. చూడండి.
థాంక్యు.

సావిరహే said...

excellent :-)

సావిరహే said...

need comment at my blog :
http://prasthanatraya.blogspot.com/
http://sarasalalonavarasaalu.blogspot.com/
http://lalithayamini.blogspot.com/