15.5.10

డేట్ అంటే..

ఒకే నెలలో ఒకే పేరుతో రెండు టపాలు పెట్టిన ఘనత నాకు దక్కింది. అర్జెంటుగా మీరంతా కలిసి నన్ను గిన్నీస్ బుక్ ఎక్కించాల్సిందే. " గిన్నె, బుక్ రెండూ రెడీ.. నువ్వు రావడమే ఆలస్యం. " అంటారా.. నేను ఒప్పుకోనబ్బా! సరేలే విషయానికొద్దాం.


డేట్ అంటే డేటింగ్. " చ! మాకు తెలీదు మరి " అనుకుంటున్నారా.. సరే ఐతే డేటింగ్ కి అర్థం చెప్తా.. డేటింగ్ అంటే కలిసి తిరగడం. అంతే అంతకు మించి ఇంకేం లేదు. " అంత తేలిగ్గా చెప్పేస్తున్నావేంటిరా బాబు ! " అనకండి. చెప్తాను.

అసలు డేటింగ్ గురించి ఏం చెప్పాలి అని కొంతసేపు ఆలోచించాను. ఏవో కొన్ని విషయాలు తెలుసు. వాటిని చెప్పేస్తే చాలు. కాని ఏ ఉపోద్ఘాతం లేకుండా చెప్పెస్తే ఎలా అనిపించింది. ఏదో కొంత ముందు చెప్పి తరువాత విషయంలోకి వెళ్లాలి. ఆ విషయం ఏంటి అని ఆలోచించాను కాని దొరకలేదు. కాబట్టి వెళ్దాం.

డేటింగ్ రెండు రకాలు. మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఇప్పుడు ఆశ్చర్యపోండి. చెప్పినా ఆశ్చర్యపోరా.. సరే మీ ఇష్టం.

డేటింగ్ రకాలు. 1. Indian Dating, 2. Foreign Dating. మన డేటింగ్ లో అమ్మాయి, అబ్బాయి కలిసి తిరగడం వరకే ఉంటుంది. వాళ్ల డేటింగ్ లో అన్నీ ఉంటాయి. ఇదీ తేడా! దీనికి మించి చెప్పడానికి ఏం లేదు. " సరే ఐతే... ఒక అమ్మాయి, అబ్బాయి తిరిగినంత మాత్రాన డేటింగ్ ఐపోతుందా " అని అడగాలనుకుంటున్నారా... అవదు. ప్రేమికులు తిరిగేదాన్ని డేటింగ్ అనరు. తిరగడమే అంటారు. వాళ్లు ఎలా తిరిగినా సరే( నేనైతే అలాగే అనుకుంటున్నాను. మరి నాకు తెలీదు )! డేటింగ్ అని ఎప్పుడంటారంటే.. ఒకొరికొకరు పరిచయం మాత్రమే ఉండి.. ఎదుటివాళ్ల గురించి తెలుసుకోవడానికి కలిసి తిరగడాన్ని డేటింగ్ అంటారు. నాకు తెలియక అడుగుతాను.. ఒకొరికొకరి గురించి తెలుసుకోవడానికి ఎక్కడో ఒకదగ్గర ఓ గంట కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది. దానికి తిరిగిడం ఎందుకు?

వెంగళప్ప దీర్ఘంగా ఆలోచిస్తూ తన స్నేహితుడు దగ్గరకు వెళ్లాడు. " ఎందుకు అలా విచారంగా ఉన్నావు " అని స్నేహితుడు అడిగాడు. " నా girl friend డేటింగ్ కి రమ్మందిరా " అని చెప్పాడు. " దానికి బాద పడతావెందుకు వెళ్లు. " అన్నాడు రెండో వాడు. " నేను కూడా వస్తాను అనే చెప్పాను " అన్నాడు వెంగళప్ప. " డబ్బులు లేవా.. నేను ఇస్తానుగా! " " డబ్బులు కూడా ఉన్నాయి. కాని ఆ డేటింగే... ఎక్కడుందో తెలీదు. " అన్నాడు. డేటింగ్ ఎక్కడుందో తెలియని రెండో వెంగళప్ప తీవ్రంగా కలత చెంది అప్పటికప్పుడే ఆలోచించి ఓ గొప్ప సలహా ఇచ్చాడు. " మనకైతే తెలియదు కాని అందరికీ తెలియదా... మీ ఇంట్లో వాళ్లని అడిగి వాళ్లనీ తీసుకెళ్లు. " అని చెప్పాడు.

సదరు వెంగళప్పలా కాకుండా అన్నీ తెలుసుకుని, ముందు జాగ్రత్తలు తీసుకుని వెళ్లండి.

డేటింగ్ కి వెళ్లే అమ్మాయిలు తీసుకోవల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. చెప్తాను వినండి. డేటింగ్ కెళ్లేటప్పుడు ఎవరితోనూ చెప్పకుండా వెళ్లొద్దు. చేసేది రాచకార్యం కాబట్టి ఎవరితో చెప్పం కాని క్లోజ్ ఫ్రెండ్ తో చెప్పండి. ఆ స్నేహితురాలితో పలానా టైమ్ లో వచ్చేస్తాను అని చెప్పండి. రాకపోతే వెంటనే ఫోన్ చెయ్యమనండి. ఆ ఫోన్ తో తప్పించుకోవచ్చు. అంతే కాకుండా వెళ్లిన గంటకే ఫోన్ చేయమని చెప్పండి. మీకు ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా ఆ కాల్ తో తప్పించుకోవచ్చు. ఇవి ముఖ్యమైనవి. ఇంత మంచి విషయాలు నాకెలా తెలిసాయి అనుకుంటున్నారా.. మొన్నే వసుంధరలో ఇచ్చాడులెండి. ఆవిధంగా డేటింగ్ రెండు రకాలని తెలిసింది.

అబ్బాయిలకు ఏ జాగ్రత్తలు ఇవ్వలేదబ్బా! నాకు తెలిసి వాళ్లకు ఉంటాయి. అవేంటో నాకు తెలీదు.

డేటింగ్ కెళ్లినవాళ్లు ఎంతమంది ప్రేమలో పడుతున్నారో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. వాటి అంతిమ లక్ష్యం మాత్రం మరింత సన్నిహితులు కావడం. అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే.. ఈ డేటింగ్ కెళ్లేవాళ్లు, the so called great ప్రేమికులు ఒకొరి గురించి ఒకరు తెలుసుకుని, సరదాగా కాలాన్ని గడుపుతూ, ఎంతో ఆనందంగా జీవిస్తూ పెళ్లి చేసుకుని జీవితంలోకి శూన్యాన్ని ఆహ్వానిస్తున్నారేమో అనిపిస్తుంది. అంతే కదా! పెళ్లి తరువాత మాట్లాడుకోవడానికి ఇంకో విషయం ఉండదు. అన్నీ ముందే మాట్లేడేసి ఉంటారు. మరి సరదాలకి చోటెక్కడిది. అందుకే ప్రేమలో పడ్డాక ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది అని నా అభిప్రాయం. అంతే కాదండోయ్.. ప్రేమ పెళ్లిలో యాభై లాభాలు ఉంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఎనభై లాభాలు ఉంటాయి.

ఇదంతా విన్నాక నేను డేటింగ్ కి వ్యతిరేఖమనుకుంటున్నారేమో.. అస్సలు కాదు. ఇప్పటికే ఈ బంపర్ ఆఫర్ ఇద్దరికి ఇచ్చేసాను. వాళ్లు సఖీన, జెస్సీ.

13 comments:

భావన said...

కృష్ణ మీరు ఇంతకు డేటింగ్ అంటే ఏమనుకుంటున్నారు ఫైనల్ గా? ;-) మీకు రెండు రకాల డేటింగ్ ల గురించి వాటి లో తేడాలు కూడా వసుంధరే చెప్పిందా??? ఇంతకు మీరు డేటింగ్ ను పొగిడారా తిట్టేరా???

శివ చెరువు said...

డేట్ నచ్చుతుంది.. పెళ్లి మాత్రం పెద్దలు కుదిర్చినదే బాగుంటుంది.. ఇదేగా మీరన్నది.. ;) సరదాకి... హి హి హి..

'Padmarpita' said...

మరి ముచ్చటగా మూడవ పోస్ట్ "డేటింగ్" తరువాత రాసేయండి:):)

సృజన said...

నాకు అర్థం అయిందిలెండి:):)

sireesha said...

chaalaa baagundabaa!!!

సవ్వడి said...

భావన గారు! రెండు రకాల డేటింగ్ ల గురించి వాటి లో తేడాలను గురించి వసుంధరే చెప్పింది. ఇక నేను విదేశం నుండి వచ్చినవాటికి పూర్తిగా వ్యతిరేఖిని.
శివ గారు! అర్థమైందిగా చాలు.
పద్మ గారు! నాకు గిన్నీస్ బుక్ ఎక్కిస్తానంటే రాస్తాను.
సృజన గారు! థాంక్స్.
శిరీష గారు! ధన్యవాదాలు.
మిగతావారికి కూడా ధన్యవాదాలు.

నేస్తం said...

:)

సవ్వడి said...

నేస్తం గారు! ధన్యవాదాలు.

శేఖర్ పెద్దగోపు said...

>>>ఒకొరికొకరి గురించి తెలుసుకోవడానికి ఎక్కడో ఒకదగ్గర ఓ గంట కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది. దానికి తిరిగిడం ఎందుకు? ..

:-):-)

సవ్వడి said...

శేఖర్! థాంక్స్.

హారం ప్రచారకులు said...

సవ్వడి గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

పరిమళం said...

:) :)

సవ్వడి said...

పరిమళ గారు థాంక్స్.