10.10.10

ఆరంభం అదిరింది

కామన్వెల్త్ ప్రారంభ వేడుకలు చాలా నచ్చాయి. ఒక్క ముక్కలో చెప్తాను వినండి… మూడు గంటల కార్యక్రమాలలో " భారతీయత "ను చక్కగా ఆవిష్కరించారు.

ఇక విశేషాలు ఏంటంటే… ౧. పతంజలి యోగ ౨. నాట్య కళల ప్రదర్శన. ( కూచిపూడి, కథక్, ఒడిస్సి మొ. ). ౩. ఐదువేల ఏళ్ల భారత ప్రయాణం. ఇంకా చిన్న పిల్లలతో కూడిన హరి హరన్ " స్వాగతం " పాట. మొట్టమొదట ప్రారంభమైన డప్పులతో కూడిన ప్రదర్శన... నాకు ఇవి బాగా నచ్చాయి.

హైలెట్ ఏంటంటే భారత బృందం ప్రవేశించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో ఘన స్వాగతం పలుకగా... కొన్ని నిమషాల్లో రాష్ట్రపతి దంపతులు, ప్రధాని దంపతులు, చార్లెస్ దంపతులు నిల్చొని చప్పట్లు కొట్టి స్వాగతం పలికారు.

ఇప్పుడు ఆ పొటోలు చూడండి.
5 comments:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

OMG. Damn good. I didn't expect this much good opening ceremony in CMG.

మాలా కుమార్ said...

మేమూ మిస్ అవకుండా చూసాము .
ఫొటోలు బాగున్నాయి .

నేస్తం said...

పొటోస్ చాలా బాగున్నాయి.. నేను చూసాను ఆరంభం :)

మందాకిని said...

ధన్యవాదాలండి. మీ టపా గురించి చెప్పినందుకు.
ఫోటొలు బాగున్నాయి. పతంజలి యోగ కూడా ఇందులో ఒక అంశంగా తీసుకుని ప్రదర్శించారా!
బాగుంది.
ఈ ఉత్సవం ఫోటోలు చూశాక వీడియో చూడాలని ఇంకా బలంగా అనిపిస్తుంది.
ధన్యవాదాలు.

సవ్వడి said...

మందాకిని గారు! పొటోలు నచ్చినందుకు ధన్యవాదాలు.
You Tube లో Commonwealth 2010 Opening Cermony అని టైప్ చెయ్యండి. అందులో వీడియోస్ ఉన్నాయి. చూడండి.