12.11.10

Today's Special



ఈ బొమ్మలను చూశాక ఈరోజు ప్రత్యేకతేంటో మీకు అర్థమైందా... అర్థం కాలేదు కదా! ఐతే మీ బుఱ్ఱలు సరిగ్గానే పని చేస్తున్నయి..:)

ఈరోజుకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే.... 12-11-10. ఈ నెంబర్లను చూడండి. ఒకొటికొకటి తగ్గుతూ వచ్చాయి. ఇదే ఈరోజు ప్రత్యేకత. అదేనండి మన డేట్..:) ఇలా వంద సంవత్సరాలకు ఒకసారే వస్తుంది..:) సో ఇదే ప్రత్యేకత.:)

ఇంత గొప్ప విషయం కనిపెట్టిన నాకు వెంటనే ఓ గ్రామి అవార్డ్, ఓ ఆస్కార్ అవార్ద్, ఇంకా ఎన్ని రకాల అవార్డులున్నాయో అన్నీ ఇచ్చేయండి. అదే చేత్తో ఓ భారత రత్న, ఓ ప్రపంచ రత్న ఇచ్చేస్తే... ఇలాగే నిరంతరంగా ప్రయోగాలు చేస్తూ గొప్ప నిజాలు కనిపెట్టేస్తూ ప్రపంచానికి తెలియజేస్తానని ప్రమాణం చేసి చెప్తున్నాను..:):)

5 comments:

జయ said...

ఇలా చాలా ఉన్నాయండీ బాబూ. ఉదా. 20.10.2010. ఇలాంటివి ఎన్నో అయిపోయాయి ఎన్నో వస్తాయి కూడా. ఉహూ, ఎంత మాత్రం దీనికి అవార్డ్ ఇచ్చే కొచ్చనే లేదు.

పద్మ said...

అబ్బే, మా దేశంలో 11/12/10 అని రాస్తామండి. కాబట్టి మీకు అవార్డ్‌కి రికమెండ్ చెయ్యటం కూడా కష్టమే. :)

సవ్వడి said...

జయ గారు! మీరు చెప్పిన డేట్ న కూడా ఇలాగే పోస్ట్ పెడదామనుకున్నాను. ఆరోజు కుదరలేదు. ఈరోజు ఇలా పెట్టేసాననమాట. మీరు చెప్పినట్లు ఇటువంటివి 2012 వరకూ ఎక్కువగానే వస్తాయి. తరువాత సంగతి తెలీదు.
నాకు అవార్డ్ ఇవ్వరా... ఐతే నేను ఇప్పుడే ప్రయోగాలన్నీ ఆపేస్తున్నాను అథ్యక్షా! ఈ దేశానికి ఎంతో నష్టం జతగబోతోందని విన్నవించుకుంటున్నాను.:):)

పద్మ గరు! మీదేశంలో అలా రాస్తారా...! ఐతే అక్కడ వాళ్లకి డేట్ ఎలా రాయాలో ముందు నేర్పించాలన్నమాట.:) మీరు డేట్ రాయడం నేర్చుకున్న తరువాత నాకు అవార్డ్ ఇవ్వాల్సిందే.:)

మురళి said...

మొత్తానికి అవార్డు ఇచ్చే వరకూ ఏదో ఒక రంగంలో కృషి చేస్తానంటారు.. కానివ్వండి.. :-)

Padmarpita said...

అభినందనలు....