30.12.12

ఒక పేరు చెప్పండి

బ్లాగు మిత్రులకు తెలుగులొనే పలకరించాలని అనుకుంటూ.. ఏమంటే బాగుంటుందో తెలియక.. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.

మిత్రులకు చిన్న విన్నపం :


మా చెల్లెలి సంబరం: మా చెల్లాయికి పాప పుట్టింది. మా బుల్లి మేనకోడలకి ముచ్చటైన పేరు పెట్టాలని ఆరాటపడుతున్నాను. తను పుట్టిన సమయం ప్రకారం " రి " అక్షరంతో పేరు పెట్టాలని చెప్పారు. పంతులు గారు " రిషిత ", "రితీష " అని రెండు పేర్లను సూచించారు. నా మనసెందుకో వాటిని అంగీకరించలేకపోతుంది. మీరు ఒక అందమైన పేరుని సూచిస్తారని ఇలా ఇక్కడకి వచ్చాను.

నాకు మాత్రం పదహరణాల తెలుగు పేరు కావాలి.

ఆశకైనా హద్దు ఉండాలంటారా..:) సరే ఏదో ఒకటి.. మంచి పేరు చెప్పేయండి.

5 comments:

పరిమళం said...

రిధిమ అంటే లక్ష్మీదేవి అని అర్ధమట!

Padmarpita said...

ఎన్నాళ్ళకెన్నాళకిలా మీ "సవ్వడి" వినగలిగానో, అనంద తాండవమాడె నా మది:-)
పేరు చెప్పమంటే గెంతులేస్తున్నాను అనుకోకుండా, నాకు తోచిన పేరొకటి..."రిక్త"
భావమేమిటే భామా అని బ్లాంక్ ఫేస్ పెట్టకండి:-)సవ్వడి said...

పరిమళ గారు! మంచి పేరు సూచించినందుకు ధన్యవాదాలు. నాకు చాలా బాగా నచ్చింది. సాయంత్రమే వాల్లకు చెప్తాను.

పద్మ గారు! మీ ఆనందం చూసి నేను కూడా మీలాగే గెంతులేస్తున్నాను ఇక్కడ. అచ్చంగా మీలాగే. మంచి పేరు చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఈ పేరును కూడా చెప్తాను.

dEwi Waijayamti said...
This comment has been removed by a blog administrator.
dEwi Waijayamti said...

intakii Emi peru pettaaru?
;(- kusumaamba 1955)- - konamanini.blog